Master Sarvari Namaskaram

Mastercvvyoga's pictureAverage: 5 (1 vote)
5172_1019215619156_1788138922_39101_7558630_n.jpg

Master Sarvari Namaskaram - Master CVV Namaskaram -Master MTA Namaskaram - Mother CV Namaskaram-

వెనకటి రోజుల్లో సంసారం ఈదలేక, సంపాదన లేక, సన్యాసం పుచ్చుకునేవారు. కొద్దిమంది మాత్రం వైరాగ్యంతో సన్యాసుల్లయ్యేవారు. మోక్షం, జ్ఞానం అనేవి తరువాతి విషయాలు. ఇప్పుడు ఆశ్రమాలలో బాగా చదువుకున్నవారు జ్ఞాన ద్రుష్టితో, అత్యాద్మిక ఉపలబ్దితో చేరుతున్నారు. ఇప్పుడు జ్ఞాన విజ్ఞానాలు, చింతన, సాధన, శాఖోపశాఖలుగా విస్తరించాయి. జ్ఞానానికి, అన్వేషణకు వేరుగా హద్దులు, సరిహద్దులు లేవు. అనంత పిపాస మనిషిలో ఏర్పడింది.

అందుకు భిన్నమైనది యోగం. యోగం ఒక ప్రయోగం. అదొక జీవనశైలి. జ్ఞానార్జనమే సూటిబాట. సత్యాన్వేషణకు స్వతంత్రశైలి. అన్వేషణ, పిపాస ఉండాలిగాని ఏ మార్గాన అన్వేషించినా తెలుసుకునేది సత్యమే అవుతుంది. అది స్వతంత్ర పరిశోధన కావాలి. అంతస్సోధన అయిఉండాలి. ఆ గవేషణను ఒక స్థితిలో ఆత్మదర్శనం అనవచ్చు. ఉన్నత స్థితిలో అదే బ్రమ్మానుభూతి అనిపిస్తుంది. ఏదైనా యోగానికి అనుభూతి ప్రధాన గవాక్షం. అనుభూతి అనుభవంగా పరివర్తన చెందాలి. అందుకు పుక్కిటి పురాణాలు, కల్పనాకథలు, పూజలు, వ్రతాలు, చిల్లర దేవుళ్ళు ఆలంబనలు కావు. ఆ సంస్కారం అలవడడానికి కొంత విషయ పరిజ్ఞానం అవసరం. హేతువాద దృక్పథం అవసరం. సమదృష్టి అవసరం. దిద్రుక్ష అవసరం. మాస్టర్ యోగ భూమికలు అర్థం కావడానికి చాల పుస్తకాలు రావాలి. చాలా విచక్షణ కావాలి. వివేకం పెరగాలి. స్వతంత్ర దృక్పధం ఏర్పడాలి. మాస్టర్ గారు ఇచ్చిన ప్రతి 'పదం' ఒక బృహత్ గ్రంథం అవుతుంది. ఒక్కొక కోర్సు ఒక పరిశోధనా గ్రంథం అవుతుంది.

యోగం ఆషామాషీ వ్యవహారం కాదు. పైగా కత్తి మీద సాము. ఇదొక వ్యసనం, పిచ్చి వ్యామోహం. ఏం సాధిస్తున్నామో ఎవరికీ ఖచితంగా తెలియదు. తెలిసినట్లు అనిపించదు. సముద్రం లోతుల్లోకి పోతున్నట్లు, ఉక్కిరిబిక్కిరి అయిపోతాం. శూన్యంలో పయనిస్తున్నట్లు ఊపిరందక అలసిసోలసిపోతాం. ఈ శూన్యంలో మన ఆశలు కొండెక్కిపోతాయి. ఆశయాలు సైతం నీరుకారిపోతాయి. చివరికి ఆగమ్యంలో, శూన్యంలో శూన్యంగా మనం మిగిలిపోతాము. అన్నిటి పైన అపనమ్మకం, దేవుళ్ళు, పూజలు, గుడులు, గోపురాలు, వేటిపైన మనసుండదు. దేనిపైన మనస్సు నిలవదు. అదొక విచిత్ర మానసిక స్థితి. ఎందుకు అయిష్టం ఏర్పడుతుందో తెలియదు. అయినవారిపైన, బంధువులపైన ఉండవలసిన బాంధవ్య బంధాలు, మమతలు, మమకారాలు లేకుండా పోతాయి. అందుకు మనం ప్రయతించం. అయినా అయిష్టం ఏర్పడుతుంది. ఏకాంతంగా చైతన్య సమాధిలో బ్రతకాలనిపిస్తుంది. ఆ పైన బ్రతుకుపైనే వ్యామోహం నశిస్తుంది. ఇష్టం పోతుంది. చావు అన్నా భయం ఉండదు. బ్రతుకు పైన ఇష్టం ఉండదు. అదొక విచిత్ర స్థితి.

ఇక్కడ మాస్టారు గారిని ఆరాధించడం, ఆయన రూపాన్ని లేదా భావాన్ని గుండెలో నింపుకోవడం, వ్యక్తి ఆరాధనే అవుతుంది. క్రమంగా అదీ సన్నగిల్లుతుంది. మాస్టర్ energy ఏదో మనలో నిండిపోతుంది. మాస్టర్ చైతన్యం సంపూర్ణతను ప్రసాదిస్తుంది. 'పరబ్రహ్మ' ప్రతినిది అనుకున్నా సరే. అది ప్రాధమికం. తరవాత అసలు పరబ్రహ్మకే రూపురేఖలు, భావం లేవని నమ్మినప్పుడు మాస్టర్ గారు అభావం కావాలి. రూపం ఉండకూడదు. ఏం మిగులుతుంది? చైతన్యం. సృష్టిని నడిపే చైతన్యం ప్రాణం. ఆ చైతన్యమే మాగ్నెట్ లా పనిచేస్తుంది. మాస్టర్ భావన మాత్రం రిమోట్ కంట్రోల్. అంటే రూపం, భావం ప్రదానం కాదు. 'సంభావన' ప్రధానం అవుతుంది. అంటే చివరికి మన హృదయంలో నుంచి ఉభికి, ఉరకలు వేస్తూ వచ్చే చైతన్యమే పరబ్రహ్మ అవుతుంది. మన ఆత్మే, మనం భావించే పరమాత్మ అవుతుంది. ఏ ప్రక్రియ ద్వారా ఏ సాధన మూలంగా, ఏ పని జరిగినా ఒక్కటే .........

యోగి కావడానికి, యోగ జీవనానికి రవంత తేడా ఉంది. 'యోగి' కావడం ఫుల్ టైం వర్కు. యోగ జీవనం , అంతర్లీనం. ఒక విధంగా పార్ట్ టైం వర్క్....... యోగాజీవనంలో కొంతభాగం యోగానికి, మిగిలిన మొత్తం కాలం సహజ జీవనానికి కేటాయిస్తారు.

- Master Sarvari Namaskaram - Master CVV Namaskaram -